గత డిసెంబర్ ఢిల్లీ లో జరిగిన గ్యాంగ్‌రేప్‌ అనంతరం దేశవ్యాప్తంగా నిరసనవ్యక్తం కావడంతో అత్యాచారాల నిరోధక చట్టానికి పదునుపెట్టాల్సిందిగా జస్టిస్‌ వర్మ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసింది. జస్టిస్‌ వర్మ కమిటీ సిఫారసుల్లో కొన్నింటిని ఆమోదించి, మరికొన్నింటిని చేర్చుతూ రూపొందించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్‌ ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. మహిళలపై జరిగే దాడుల్ని ఇక అత్యాచారాలుగా కాకుండా లైంగికదాడిగా చెప్పాలని కమిటీ సూచించింది లైంగిక దాడుల కేసుల్లో గరిష్టంగా 20 ఏళ్ల శిక్షను వర్మకమిటీ సూచించింది. దీంతో పాటు బాధితురాలు మరణించినా, అచేతనావస్థ లోనికి వెళ్లినా నేరగాళ్లకు మరణ శిక్ష విధించాలని ఆర్డినెన్స్‌లో ఉంది. ఐతే మరణశిక్షను వర్మకమిటీ సిఫారసు చేయకపోయినా కేంద్రమే దీన్ని చేర్చిందని వామపక్ష మహిళా సంఘాలతోపాటు కొన్ని పౌరసంఘాలు చెపుతున్నాయి. దీనివల్ల నేరగాళ్లు సాక్ష్యాధారాలు లేకుండా చేయడం కోసం బాధితుల్ని చంపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఈ ఆర్డినెన్స్‌ చట్టంగా రూపొందడానికి ఆరునెలల్లోగా పార్లమెంటు ఆమోదం పొందాలి. ఫిబ్రవరి 21నుంచి ప్రారంభం అయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్డినెన్స్‌ అమలు చేయటాన్ని కేంద్రక్యాబినెట్‌ శుక్రవారమే ఆమోదించింది. . బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదించగానే దేశరాజధానిలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రకటించాయి. ఈ బిల్లులో పారదర్శకత కొరవడిందని రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేయకూడదని పట్టుబడుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: