పుట్ బాల్ క్రీడా చరిత్రలోనే అతి పెద్ద ఫిక్సింగ్ భూతం బట్టబయలైంది. యూరోపియన్ లీగ్ తో పాటు గత కొన్నేళ్లుగా జరుగుతున్న సాకర్ మ్యాచ్ లు, వరల్డ్ కప్ మ్యాచ్ లు అన్ని ఫిక్సింగ్ అయ్యాయని యూరో పోల్ అనే ఏజెన్సీ బయటపెట్టంది. 30 దేశాల్లో 700 మ్యాచులు, 425 మంది ప్లేయర్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డారిని ఆ సంస్థ తెలిపింది. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ భారీ ఫిక్సింగ్ లో వందల కోట్ల రూపాయల చేతులు మారాయని...ఇంతకు ముందు ఉన్న స్టార్ ప్లేయర్లు, ఇప్పుడున్న స్టార్ ప్లేయర్లు అందరూ ఫిక్సర్లే అని యూరో పోల్ తేల్చి చెప్పింది. అంతేకాదు యూరో క్లబ్ లు అన్ని ఒప్పందాల ప్రకారమే నడుస్తున్నాయని... ఆయా ఫ్రాంఛైజీలు తమ ప్లేయర్లను ఫిక్సింగ్ కు పాల్పడాలని ప్రోత్సహిస్తున్నాయని యూరో పోల్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: