విద్యుత్ సర్ ఛార్జీల బకాయిలను కొంత మేరకు వినియోగదారులు భరించలేక తప్పదని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ సర్ ఛార్జీల బకాయిలు దాదాపు రూ. 11 వేల కోట్లు ఉండగా వాటిలో సుమారు రూ.6వేల కోట్లను ప్రభుత్వం భరిస్తుందని , మిగిలిన రూ.5వేల కోట్లను వినియోగదారులపై మోపకతప్పడం లేదని ఆయన పేర్కొన్నారు.  ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఇఆర్సీ) మార్గదర్శకాల మేరకే సర్ఛార్జీ వసూలు చేయనున్నట్లు సిఎం చెప్పారు. అయితే ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులకు సర్ ఛార్జీల మోత ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. సిఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం శాసనమండలి ఆవరణలోని తన ఛాంబర్లో మీడియో ప్రతినిధులతో ఆయన ఇష్ఠాగోష్టిగా మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.  రాష్ట్రంలో 15 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని, అదనపు విద్యుత్ కోసం, విద్యుత్ కోసం, విద్యుత్ ఉత్పత్తి కోసం అదనపు గ్యాస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 2.25 ఎంఎంఎస్ సిఎండి గ్యాస్ కావాలని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. సింహాద్రి నాలుగవ ధశ యూనిట్లో 500 ల మేగావాట్ల విద్యుత్ త్వరలో అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు.  గెయిల్ నుంచి అదనపు గ్యాస్ లభిస్తుందని, నార్త్, ఈస్టు నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా పవర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్న కొత్త విద్యుత్ లైన్లు 2013 చివరి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చేపట్టినున్నట్లు ఆయన చెప్పారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో మంత్రులు ఎన్నిరోజుల పర్యటించాలనే విషయం ఇంకా ఖరారు కాలేదని ముఖ్యమంత్రి చెప్పారు.  మంత్రుల పర్యటన వివరాలను తెలియజేస్తూ సమాచార శాఖ షెడ్యూల్ను విడుదల చేసిందని ఒక సిఎం దృష్టికి తీసుకురాగా అలాంటిదేమైనా ఉంటే అది తప్పన్నారు. న్యాయవాదుల విషయంలో సుప్రీకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని, ప్రభుత్వం తరఫున అవసరమైన వివరణ ఇస్తామన్నారు. ఐఎఎస్ అధికారులపై మంత్రి టి.జి.వెంకటేష్ చేసిన వాఖ్యలు సమంజసం కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరూ హద్దులుమీరి మాట్లాడవద్దని, అధికారంలో ఉన్న పార్టీ నాయకులు మరింత బాధ్యతగా, ఆచూతూచి వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: