కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య బంధం మొదలైంది రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, యుపీఏ అభ్యర్థుల ప్రణబ్ ముఖర్జీకి, హమీద్ ఆలీ అన్సారీలకు మద్దతునివ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఈ రెండు పార్టీలకు మధ్య బంధానికి పునాది వేయబడింది.  అయితే రాష్ట్రానికి చెందిన మిగతా రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే నిన్నిటి మొన్నటి వరకు ఆ పార్టీ నాయకులందరూ కరుడుగట్టిన కాంగ్రెస్ వారే, ఏదో పార్టీ అధినేత్రి వ్యవహారశైలి నచ్చక, సొంతంగా రాణించాలన్న ఆలోచనలో కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ స్థాపించుకున్నారు. ఈ పార్టీకి ఇదే తొలిపరీక్ష జాతీయ రాజకీయాలను తన విధానాన్ని ప్రకటించే అవకాశం ముఖ్యంగా కాంగ్రెస్ పట్ల వైఖరిని వెల్లడించే అవకాశం వచ్చింది. దీంతో దీర్ఘకాలిక పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, యుపీఏ అభ్యర్థులకు మద్దతు తెలియజేశారు. ఇలా కాంగ్రెస్కు మద్దతు అంటే ఆ పార్టీలో ఇప్పటికిపుడే లేదా 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేయటం అర్థం కాదనిపిస్తుంది.  దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యుపీఏను బయట నుంచి భాగస్వామ్య పక్షాలుగా మద్దతునిస్తున్న పలు ప్రాంతీయ పార్టీల మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతునివ్వాలన్నదే ఆ పార్టీ ఆలోచన అనేది సంకేతాలు రుజువు చేస్తున్నాయి. ఈ నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఎన్డీఏ వైపు మొగ్గుచూపుతుందని కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ప్రస్తుతం మాత్రం తెరపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: