Image result for akhilesh yadav
తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడొకడైనా ఉంటాడనే నానుడికి గొప్ప ఉదాహరణ ఇది. ప్రశాంత్ కిషొర్ 2014 లో మోడీ ప్రచారాన్ని తొలిసారి డిగిటలైజ్ద్ గా వ్యూహం రూపొందించి గెలుపుకు అధిక చక్కని అవకాశాలను పెంపొందించి నిజంగా చెప్పాలంటే గెలిపించారు. అలాంటి ప్రశాంత్ కిషొర్ ను బిహార్ శాసనసభకు 2015 లో జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ వినియోగించుకొని తమ మిత్రపక్షాలను గెలిపించుకున్నారు. ఈ విధంగా ప్రశాంత్ కిషొర్ వ్యూహాత్మకంగా ఎన్నికల వ్యూహకర్తగా తనను తాను ఋజువు పరచుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తిని మన రాహుల్ బాబు 2017 లో జరగనున్న ఉత్తరప్రదేశ్ లో తమ కాంగ్రెస్ గెలుపుకు వ్యూహాలు రచించటానికి నడిపించటానికి నియమించుకున్నారు. 

Image result for prasant kishor

ఈ విషయం సమాజ్ వాది పార్టీకి కొంతకంటగింపుగా మారింది. రానున్న ఉపద్రవాన్ని ముందే ఊహించిన సమాజ్వాదీ పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా హార్వర్డ్ విద్యావేత్త, అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ దారు ఐన హిల్లరీ క్లింటన్ రాజకీయ వ్యూహకర్త విశ్వవిఖ్యాత రాజాతిజ్ఞుడు హార్వర్డ్ విద్యావేత్త, ప్రొఫెసర్ స్టీవ్ జార్డింగ్ ను ప్రచార రంగము లోకి దింపటానికి రంగం సిద్ధం చేసుకుంది. రెండోసారి కూడా ఎలాగైనా పాలన పగ్గాలు చేపట్టాలనే లక్ష్యంలో భాగంగా ఆయనను ప్రచార వ్యూహాల కోసం నియమించనుంది. ఇప్పటికే పలు సలహాలను కూడా స్టీవ్ జార్డింగ్ సమాజ్వాదీకి పార్టీకి  ఎస్పీకి అందించినట్లు తెలుస్తుంది. 

Image result for prasant kishor

హార్వార్డ్ లోని కెన్నడీ స్కూల్ లో పుబ్లిక్ పాలసీ బోధిస్తున్నారు. 1980 నుంచి పొలిటికల్ కన్సల్టెంట్గా, ప్రచారాల మేనేజర్ గా పనిచేస్తున్నారు. హిల్లరీ క్లింటన్, అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్, స్పానిష్ ప్రధాని మారియనో రాజోయ్, వంటివారంతా కూడా ఈయనను సంప్రదించేవారే. ఈ నేపథ్యంలోనే సమాజ్ వాదీ పార్టీ ఆయనను సంప్రదించగా వ్యూహాలు సిద్ధం చేసేందుకు ఆయన ఇప్పటికే లక్నోకు చేరుకున్నారు. 

Image result for professor steve jarding Harvard

ముఖ్యంగా సంక్షేమ పథకాల ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే ఆయన చెప్పారట. ప్రజలకు ఇది కేంద్ర పథకమా, రాష్ట్ర పథకమా అనే విషయం తెలియదని, ముఖ్యంగా "సమాజ్ వాది పెన్షన్ యోజన" అనే పథకాన్ని ప్రముఖ "బాలీవుడ్ నటి విద్యాబాలన్" తో ప్రచారం చేయించాలని ఆయన సలహా ఇచ్చారట. మొత్తానికి ప్రచార వ్యూహం మొత్తాన్ని తిరిగి రీ-డిజైన్ చేస్తున్నారని తెలిసింది. కేంద్ర పథకాలను రాష్ట్ర పదకాలను కలగా పులగం చేసి ఏదిఎవరివైనా మొత్తం అఖిలేష్ నాయకత్వలోని సమాజ్ వాదీ పార్టీ పదకాలుగా మార్చి - పాత సీసాలు తీసేసి కొత్తసీసాల్లోనే కొత్తగా కొత్త వ్యూహాలతో ఎస్పీ ముందుకెళ్ళటం సిద్ధం. ఇక మోడీ ఎవరిని ప్రచార వ్యూహకర్తగా తీసుకువస్తారో?  
  
  Image result for vidhya balan in saree

మరింత సమాచారం తెలుసుకోండి: