గత కొన్ని రోజుల నుంచి కర్ణాటకకు తమిళనాడుకు మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంతే కాదు ఇప్పటికే వందల కోట్ల ఆస్తి సష్టం కూడా వాటిల్లింది. ఇక బంద్ లు, రాస్తారోకోలు, ధర్నాలు ఇరు రాష్ట్రాల్లో రోజూ జరుగుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో కావేరీ జలాల పంపణి విషయంలో కర్ణాటకకు సుప్రీమ్ కోర్టు షాక్ ఇచ్చింది. తమిళనాడుకు రేపటి నుంచి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. మంగళవారం సుప్రీం కోర్టులోని ద్విసభ్య బెంచ్ కావేరీ జలాల పంపిణి విషయం కేసు విచారణ చేసింది.

తమిళనాడుకు ఇప్పట్లో కావేరీ నీరు విడుదల చెయ్యడం వీలుకాదని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది ఎస్. నారిమన్ సుప్రీం కోర్టుకు చెప్పారు. కావేరి జలాల పంపిణీని పర్యవేక్షించేందుకు కావేరి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.   గత కొంత కాలంగా తమకు తాగటానికి మాత్రమే నీళ్లు ఉన్నాయని సాగు కోసం నీరు లేదని సాగునీటికి నీటి విడుదల సాధ్యం కాదన్న వాదిస్తుంది. ఇక కర్ణాటక వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది.
SC orders Karnataka to release 6,000 cusecs of water to Tamil Nadu
కావేరి జలాల అంశంపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ఇప్పటికే తమిళనాడుకు 1,68,000వేల క్యూసెక్కుల జలాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.కర్ణాటక, తమిళనాడు వాదనలు విన్న సుప్రీం కోర్టు సెప్టెంబర్ 27వ తేది వరకు తమిళనాడుకు 6,000 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: