సామాన్య ప్రజలపై మరోసారి పెనుబారం పడింది. ఇప్పటికే పెంచిన నిత్యావసర ధరలతో సతమతమవుతుంటే, మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోల్ ఒక లీటర్ కు రూ. 1.50, డీజిల్ లీటర్ కు 45 పైసలు పెంచారు. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.  కాగా, గత జనవరిలో పెట్రోల్ ధర లీటర్ పై 30 పైసలు తగ్గించిన సంగతి తెలిసిందే. చమురు ఉత్పత్తి సంస్థల ఒత్తిడి కారణంగానే మళ్లీ ధరలు పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చమురు సంస్థలు లీటర్ డీజిల్ కు రూ.9.22 , కిరోసిన్ లీటర్ కు 31.60, గ్యాస్ సిలిండర్ (14.2 కి) ఒక్కింటికి రూ. 481.03 నష్టపోతుండడం ధరల పెంపుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.    ధరలపై ఆందోళన:  కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై  సీపీఎం నిరసన వ్యక్తం చేసింది. ఈ అంశంపై శనివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పిలుపునిచ్చారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: