తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రగిలిన కావేరీ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు.సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని కర్నాటక ప్రభుత్వం సోమవారం తెలియచేసింది. సుప్రీంకోర్టు తమిళనాడుకు పదిరోజుల పాటూ ప్రతిరోజూ నీటిని విడుదల చేయమని కోరుతూ కర్ణాటకని ఆదేశించింది. దీంతో బెంగళూరుతో పాటూ మాండ్యా తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది. అంతే కాదు కర్ణాటక ప్రభుత్వం తమ రిజర్వాయర్లలో తగినంత నీరు లేదని అందువల్ల తాము విడుదల చేయలేమని తెలిపింది.
Image result for tamil nadu cauvery water fight
ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను సవరించాలని కోరింది. ఈ ఏడాది చివరి నాటికి మాత్రమే తాము నీటిని విడుదల చేయగలమని పేర్కొంది. రేపటితో ప్రతిరోజూ నీటిని విడుదల చేసే ప్రక్రియ ముగుస్తుంది. ఈ లోపే కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పులో 42 వేల క్యూసెక్కుల నీళ్లు అదనంగా తమిళనాడుకు విడుదల చేయమని ఆదేశించింది.
Image result for tamil nadu cauvery water fight
ఆ నీటిని కూడా డిసెంబర్ చివరినాటికి మాత్రమే విడుదల చేస్తామని తాజాగా వేసిన పిటిషన్లో కర్ణాటక పేర్కొంది.ర్యవేక్షక కమిటీ నిర్ధారించిన మొత్తం కన్నా 3వేల క్యూసెక్కులను పెంచింది. కావేరీ ట్రిబ్యునల్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా నాలుగు వారాల్లోగా కావేరీ నదీ జలాల నిర్వహణా బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: