పాకిస్తాన్ పై భారత్ చర్యకు క్రమంగా భారత్ కు అనుకూలతలు ప్రదర్శితమౌతున్నాయి. నిన్నటివరకు అమెరికా భారత్ ను బహిరంగంగానే సమర్దించింది. ఒక ప్రకటన బారక్ ఒబామా నుండి మరో ప్రకటన జాన్ కెరి నుండి వెలువడ్డాయి. అంటే కాదు సార్క్ దేశాల్లో భారత్ వెంట నడవటానికి అఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ తో పాటు శ్రీలంక సిద్ధంగా ప్రకటనలు వివిధ సంధర్భాల్లో విడుదల చేసాయి. చైనా సైతం తమ సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పాయి. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ తో గిల్గిత్ లో సం-యుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన రష్యా ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు హెచ్చరికే చేసింది.  

Russia warns pakistan supports india కోసం చిత్ర ఫలితం



పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై ఆ దేశ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రష్యా హెచ్చరించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న టెన్షన్ వాతావరణం మరింత ఉధృతం కాక ముందే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలని సూచించింది. ఇరు దేశాలు సంప్రదింపుల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుకోవాలని ఆదేశించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటంలో తాము అన్నివేళలా సహకరిస్తామని పరోక్షంగా పాకిస్తాన్కు రష్యా హెచ్చరికలు చేసింది. 

Russia supports india కోసం చిత్ర ఫలితం 

ఇండియా, పాకిస్తాన్ల మధ్య నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోలేని పక్షంలో మరింత ఉధృత వాతావరణం ఏర్పడే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తమ భూభాగంలోని ఉగ్రమూక గ్రూపులపై కఠిన చర్యలు అవలంభించాలని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపారు. యూరీ సెక్టర్  ఘటన అనంతరం పాక్ ఉగ్రవాదులపై ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదలచేసింది.

Russia supports india కోసం చిత్ర ఫలితం

 
నియంత్రణ రేఖ వెంబడి మొహరించి ఉన్న ఉగ్రమూకలను ఏరివేయడానికి సెప్టెంబర్ 28 అర్థరాత్రి భారత సైన్యం నిర్దేశిత దాడులు నిర్వహించింది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అగ్రరాజ్యం అమెరికా, రష్యా సహా పలు ప్రపంచ దేశాల నుంచి పూర్తి మద్దతు వస్తోంది. దీంతో పాక్ ఏకాకి మారుతోంది. 


ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్ను ఏకాకికి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సార్క్ సభ్య దేశాలను తమ వైపుకు తిప్పుకోవడంలో భారత్ విజయవంతమైంది. పాకిస్థాన్లో జరిగే సార్క్ సదస్సును బహష్కరిస్తున్నట్టు మాల్దీవులు ప్రకటించింది.


ఇంతకుముందు భారత్ సహా బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక బాయ్కాట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సార్క్ సభ్య దేశాల్లో పాక్ ఏకాకి అయ్యింది.షెడ్యూల్ ప్రకారం నవంబర్లో పాకిస్థాన్లో సార్క్ సదస్సు జరగాల్సివుంది. కాగా ఉగ్రవాద దాడి అనంతరం ఈ సదస్సులో పాల్గొనబోమని భారత్ ప్రకటించింది. అంతేగాక ప్రపంచ దేశాల్లో పాక్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నించింది.


ప్రపంచ దేశాలు ఉడీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ భారత్కు బాసటగా నిలిచాయి. ఇక దక్షిణాసియా దేశాలు కూడా ఏకతాటిపై నిలిచాయి. భారత్ బాటలోనే అప్ఘాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు.. సార్క్ సదస్సును బహిష్కరించాయి. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (SAARK) లో మొత్తం ఎనిమిది దేశాలున్నాయి. సార్క్లో భారత్, పాకిస్థాన్, నేపాల్ (host), అప్ఘాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు సభ్య దేశాలు. గత సార్క్ సమావేశం 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇస్లామాబాద్ లో జరగాల్సిన 19వ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది.


Russia supports india కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: