తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్‌తో భుజంకలిపి ఉద్యమించిన పార్టీ అది. ఉప ఎన్నికల్లో సీమాంధ్ర లో టీడీపీకి మద్దతిచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్‌కే జైకొట్టిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానని కేసీఆర్ ప్రకటించడం తప్పన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఇస్తే మీలో కలిసిపోతానని కేసీఆర్ అనడం క్విడ్ ప్రో కో అవుతుందన్నారు. 2014 ఎన్నికల్లో తడాఖా చూపుతామని కేసీఆర్ అంటున్నారుగానీ తెలంగాణకు ఓట్లు, సీట్లతో ముడిపెట్ట వద్దని హితవు పలికారు!  ప్రొఫెసర్ జయ శంకర్ బతికి ఉంటే ఆమాట విని ఆత్మహత్య చేసుకునేవారని, కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణపై తేలిక భావం ఏర్పడడానికి కారణం కేసీఆరేనన్నారు. గుమ్మనంగా గట్టిగా పోరాడితే కేంద్రం దిగి వచ్చేదని, కేసీఆర్ నిలకడ లేని నైజం, కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లడం , పార్టీని కలుపుతానని చెప్పడం ఒక పార్టీని మరో పార్టీకి దగ్గర చేస్తాననడం అవమానకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశం ఆ రెండు పార్టీల సొత్తుకాదని, ప్రత్యేక రాష్ట్రం కోరే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు టీఆర్ఎస్, జేఏసీల్లోనూ ఉన్నట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: