మన దేశ రాజకీయాల్లో హామీలు ఇవ్వడం, ఇచ్చిన హామీలు మరవడం చాలా సాధారణ విషయం అనే సంగతి అందరికీ విదితమే. అయితే దేశ రాష్ట్రాల్లో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయిన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన దాఖలు లేవు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి, ఓట్లను రాబట్టడానికి ఉన్న నిధులకు మించి హామీలు ఇచ్చి, తీరా గెలిచినా తర్వాత ఎన్నో షరతులతో కొన్ని పథకాలను ప్రవేశ పెట్టి, మరికోన్నింటినీ మామా అనిపించడం నేటి రాజకీయాల్లో మనం చూస్తూనే ఉన్నాం.