ఇప్పటివరకు ఉన్న ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగానికి మించి గంటకు 250 నుంచి 300 కి.మీ. వేగంతో వెళ్ళే హై స్పీడ్ రైళ్లు త్వరలోఅందుబాటులోకి రానున్నాయి. అతితక్కువ సమయంలో గమ్యానికి చేరుకోవాలని ఆశిస్తున్న ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ఇలాంటి ప్రణాళికలు సిద్ధంచేసింది. దీని కోసంఫ్రాన్స్ జాతీయ రైల్వేతో భారతీయ రైల్వే ఒప్పందం కుదుర్చుకుంది.  మొదటి దశలో దేశవ్యాప్తంగా ఎనిమిది హై స్పీడ్ రైళ్ల కారిడార్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. వీటిలో దక్షిణ భారతదేశానికి సంబంధించి చెన్నై-బెంగళూరు-త్రివేండ్రం, తిరువనంత పూర్-మంగుళూరు, బెంగళూరు-మైసూరు(మార్గం) ఉన్నాయి. మన రాష్ట్రంలో విశాఖ మీదుగా హౌరా-చెన్నై హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ కారిడార్‌కు సంబంధించి రైల్వే బోర్డు ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ నుంచి డోర్నకల్, విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే హై స్పీడ్ రైలుతోపాటు హౌరా వెళ్లేందుకు కూడా హై స్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకు రానున్నారు. గంటకు 250 నుంచి 300 కి.మీ వేగంతో నడిచేందుకు వీలుగా ట్రాక్‌లను వెయ్యాలి. అలాగే ఆ వేగానికి తగ్గట్టుగా కోచ్‌లు కొత్తగా రూపొందించాలి. కాని ప్రస్తుతం ఉన్న ట్రాక్ల పరిస్థితి రాజధాని రైళ్లు గంటకు 100 నుంచి 120 కి.మీ, ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటకు 80 కి.మీ మించి పరుగెత్తలేవు. అలాగే బ్రిడ్జిలు, సిగ్నలింగ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలి. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో హై స్పీడ్ రైళ్ల ఆగమనానికి సంబందించి రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సాల్ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: