పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో గల వ్యూహాత్మక గ్వదర్ ఓడరేవును పాకిస్థాన్ ప్రభుత్వం చైనా సంస్థకు అప్పగించింది. ఈ రేవు పాకిస్థాన్ ఆస్తిగానే ఉన్నా, దాని నియంత్రణ, వ్యాపారం ఇతర వ్యవహారాలన్నీ చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధీనంలో ఉంటాయి. దానిపై వచ్చే లాభాల్లో పాక్‌కు వాటా లభిస్తుంది.  ఈ మేరకు ఇరు దేశాలు సోమవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం పాక్-చైనాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అన్నారు. చైనాకు మధ్యప్రాచ్యంతో వ్యాపార సంబంధాలు నేరపడానికి ఈ రేవు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒక వేళ చైనా ఈ రేవులో తన మిలిటరీని రహస్యంగా దింపితే అది మన భద్రతకు పెను ముప్పు. ఈ రేవు గుజరాత్,ముంబైలకు దగ్గరగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: