ఆలూ లేదు....చూలు లేదు....తెలుగు సామెత అందరికి గుర్తుండే ఉంటుంది. లోక్‌సభకు వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికలలో బిఎస్‌పి విజయం సాధిస్తుందని, ఎర్రకోటపై జాతీయ జెండా తానే ఎగుర వేస్తానని (అది కేవలం ప్రధాన మంత్రి చేస్తారు ) బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేసారు. 2009 ఎన్నికలకు ముందు కూడా మాయ ఇలాగే బీరాలు పలికారు.  బిఎస్‌పి మాత్రమే దేశానికి స్థిరత్వం ఇవ్వగలదన్నారు. బిఎస్‌పి పార్టీకు ఎంతో గిరాకీ ఉంటుందన్నారు. రిజర్వేషన్లు ఉండాలనే తాము ప్రవేశపెట్టిన బిల్లును బిజెపి వ్యతిరేకించిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బిల్లును వెంటనే అమలు చేస్తామని ఆమె వివరించారు. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు దేశంలోఉన్న కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను హరించివేసాయన్నారు. బిఎస్‌పి ఈ బిల్లుల గురించి వీధి స్థాయి నుండి పార్లమెంటు వరకూ పోరాటం చేసిందన్నారు. ఆంద్రప్రదేశ్‌లో తెలంగాణా, మహారాష్ట్రలో విదర్భాలను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడానికి తమ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నగదు బదిలీ పథకం నిరుపేదలకు ఎంత మాత్రం ఉపయోగపడదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: