ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు కరువాయ్యారా? గతం కంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్దికి గానీ... పార్టీ బలోపేతా నికి గానీ... రాష్ట్ర క్షేత్ర స్థాయిలో గానీ, కేంద్రంలో గానీ... పార్టీ నాయకత్వం విఫలమైందా అంటే దాదాపుగా అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి! ఇందులో తెలంగాణ లో కొంత వరకు వర్తించినా... ఏపీ లో పూర్తి స్థాయిలో ఉందనే చెప్పాలి. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు రాష్ట్ర రాజకీయాలే తప్ప కేంద్రంలో చక్రం తిప్పే నాయకత్వం తాజా గా లోపించింది.