గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి వీసా మంజూరుపై బ్రిటన్, ఐరోపా సమాఖ్య సానుకూలంగా స్పందించినా అమెరికా మాత్రం ససేమిరా అంటోంది.  అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాబర్ట్ బ్లేక్ మంగళవారం మీడియా తో మాట్లాడుతూ మోడీకి వీసా మంజూరుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు, ఆయనకు వీసా మంజూరుకు సంబంధించి అమెరికా పునరాలోచించే ప్రశ్నే లేదని, మోడీపై ఉన్న కేసుల అంశం కొలిక్కి వస్తేనే తాము వీసా మంజూరు గురించి ఆలోచిస్తామని అన్నారు. ఎవరైనా అమెరికా వీసా కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని ,దానిపై నిర్ణయం తీసుకోవడానికి చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటామాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  అయితే, జరగబోయే 2014 ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి అప్పుడు కూడా అమెరికా ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: