దేశాన్ని కుదిపేస్తున్న హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు బ్రిటన్ హామీ ఇచ్చింది. తమ దేశంలో ప్రపంచలోకెల్లా అతిబలమైన అవినీతి వ్యతిరేక చట్టం ఉందని తెలిపింది. భారత్ పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు.  అణు ఇంధన సహకారం, భద్రత, ఉగ్రవాదం, వాణిజ్యం వంటి పలు కీలకాంశాలపై ఉభయులూ విస్తృత చర్చలు జరిపారు. రూ.3,600 కోట్ల విలువైన హెలికాప్టర్ల కాంట్రాక్టును చేజిక్కించుకునేందుకు ఇటలీ కంపెనీ ఫిన్‌మెకానికా అవలంబించిన అనైతిక విధానాలను మన్మోహన్.. కామెరాన్ దృష్టికి తీసుకొచ్చారు. బ్రిటన్‌కు చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ను ఫిన్‌మెకానికా తీసుకుంది. భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో మన్మోహన్, కామెరాన్‌లు ఇద్దరూ ప్రకటనలు చదివారు. ఆంగ్లో-ఇటాలియన్ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు సంబంధించిన కుంభకోణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పూర్తి సహాయ సహకారాలు అందజేయాల్సిందిగా కామెరాన్‌ను కోరినట్లు ప్రధాని చెప్పారు. బ్రిటన్ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారానికి కామెరాన్ హామీ ఇచ్చారని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: