గత కొద్ది రోజులుగా అడపా దడపా తప్ప... వార్తల్లోకి రాని గ్యాంగ్ స్టర్ నయీం విచారణ మరోసారి తెర పైకి వచ్చింది. గత రెండు నెలల క్రితం షాద్ నగర్ శివారు ప్రాంతంలోని మిలినియమ్ టౌన్ షిప్ లో గ్రేహౌండ్స్ పోలీసుల చేతులో హతమైన మోస్ట్ వాండెట్ గ్యాంగ్ స్టర్, కరుడు గట్టిన ఉన్మాది భువనగిరి నయీముద్దీన్ అలియాస్ నయీం భాయ్ ను హతమైన సంగతి విదితమే.