1919లో బ్రిటిష్ సేనల తూటాలకు వెయ్యిమందికిపైగా నేలకొరిగిన జలియన్‌వాలా బాగ్ ప్రాంతాన్ని బుధవారం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సందర్శించారు. అమర్‌జ్యోతి వద్ద తల దించుకొని, చేతులు జోడించి నిమిషంపాటు మౌనం పాటించారు.  భారతదేశ చరిత్ర పుటల్లో నెత్తుటి మరకగా, నాటి బ్రిటిష్ పాలకుల క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచిపోయిన జలియన్‌వాలా బాగ్ ఉదంతంపై స్పందిస్తూ అత్యంత సిగ్గుచేటైన చర్యగా అభివర్ణించారు. నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవార్థం మోకాళ్లపై కూర్చుని నివాళులు అర్పించారు. జలియన్‌వాలా బాగ్ బ్రిటిష్ చరిత్రలో సిగ్గుచేటు చర్య. ఈ ఉదంతాన్ని విన్‌స్టన్ చర్చిల్ రాక్షసత్వ చర్యగా అభివర్ణించారు. ఇక్కడ జరిగింది మనం ఏనాటికీ మరచిపోలేం.’’ అని సందర్శకులు పుస్తకంలో రాశారు. తన పర్యటన సందర్భంగా జలియన్‌వాలా బాగ్ ఉదంతంపై కామెరాన్ క్షమాపణలు తెలపాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేసినా, కామెరాన్ మాత్రం క్షమాపణల జోలికి వెళ్లలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: