కాంగ్రెస్‌ లో తనపార్టీని విలీనం చేసేందుకు సిద్ధపడ్డ కేసీఆర్ పట్ల ఇక మెతక వైఖరి తగదని బిజెపి తీర్మానించుకున్నట్లు సమాచారం. తమ పార్టీకి ఓ పక్క మతతత్వాన్ని ఆపాదిస్తూ మరోపక్క ఎన్డీఏతో కలిసైనా తెలంగాణ సాధిస్తామంటున్న కెసిఆర్ ద్వంద్వ వైఖరిని చీల్చిచెండాడాలని నిన్న జరిగిన ఆ పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్ణయించింది.  జేఏసీని కెసిఆర్ తన గుప్పెట్లో పెట్టుకుని తమను, నాగం జనార్దనరెడ్డిని దూరం పెడుతున్నారన్న అనుమానాన్ని ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అవకాశవాదులకు, పెట్టుబడిదారులకు, ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారికి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి తెలంగాణకు, తెలంగాణ వాదులకు ద్రోహం చేశారన్న అనుమానం రోజురోజుకి తెలంగాణ వాదుల్లో బలపడుతోంది. తెలంగాణకు మద్దతు తెలిపే పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఇటీవల కాలంలో కెసిఆర్ ను బహిరంగంగా విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: