ఈ ఉదయం గుంటూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన దిలుసుఖ్ నగర్ లోని ఘటనాస్థలిని పరిశీలించి బాంబు పేలుళ్ల ఘటనను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ముందే హెచ్చరించినా వాటిని పెడచెవిన పెట్టడం బాధాకరమన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అలక్ష్యం, వైఫల్యం కనిపిస్తోందన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో సార్లు పేలుళ్లు జరిగితే, ఇప్పటికీ ఏ ఒక్క కేసులోనూ నిందితులను పట్టుకోలేదన్నారు. దిల్ సుఖ్ నగర్లో జంట పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అమాయకులు బలయ్యారని అన్నారు. ఈ పేలుళ్లు పక్కా పథకం ప్రకారం జరిగినవేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: