ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారన్న సామెత మన అందరికి తెలిసిందే. అంతేకాదండి ఇలాంటి సామెత రుజువు చేస్తూ మన జీవితంలో ఎన్నో సంఘటనలు తారస పడతాయి. సరిగ్గా ఇదే జరగబోతుంది మన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కు. గత ఆగష్టు 8 వ తేదిన గ్రేహౌండ్ పోలీసుల చేతిలో హతమైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్ స్టర్ నయీంతో నేతి విద్యాసాగర్ పెట్టుకున్న సంబంధాలు ఇంతా అంతా కాదు.