హైదరాబాద్‌లో పేలుళ్ల ఘటనపై హోంమంత్రి షిండే ప్రకటనపై బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి ప్రకటన రొటీన్‌గా ఉందని, ఘటన తీవ్రతకు తగినట్లుగా లేదని ఆమె విమర్శించారు. ఉగ్రవాదుల నుంచి సమాచారం ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదని, అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు, ఈ పేలుళ్లకు ఏమైనా సంబంధం ఉందా అని ఆమె ప్రశ్నించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదని ఆమె మండిపడ్డారు. పేలుళ్ల పైన ప్రకటనలు చేసి చేతులు దులిపేసుకోవడం కాదని, ఎక్స్ గ్రేషియా ఇవ్వటంతో సమస్య పరిష్కారం కాదని, ఉగ్రవాద చర్యలు అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని మతం దృష్టితో చూడరాదని సుష్మాస్వరాజ్ అన్నారు. హైదరాబాద్, ముంబై, బెంగుళూరులో పేలుళ్లు జరుగుతాయని ఉగ్రవాదులు హెచ్చరించారని , మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిఘా సమాచారంలో వీధి నెం ఉండదని, సమర్ధమైన యంత్రాంగంతో దాన్ని చేదించాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: