భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యెగితా ఠాక్రే హత్య కేసును మూసివేయాలన్న సీఐడీ నివేదికను నాగపూర్ కోర్టు తిరస్కరించింది. 2009 మేలో గడ్కరీ నివాసంలోని కారులో ఏడేళ్ల యోగిత మృతదేహాన్ని కనుగొన్నారు. యోగితా ఠాక్రే తండ్రి ఇచ్చిన ప్రైవేట్ ఫిర్యాదులోని అంశాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ బాలిక మృతిని ప్రమాదంగా నాగపూర్ పోలీసులతోపాటు సీఐడీ కూడా పేర్కొంది. యోగితను హత్య చేశారని, ఈ కేసును మాఫీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇప్పుడు నాగపూర్ కోర్టు తీర్పు తో గడ్కారి కి మళ్లి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: