తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి, ఆయన ఆధ్వర్యంలోని కంపెనీలకు నిధులను రాబట్టేందుకే వైఎస్ సర్కారు అడ్డగోలుగా నిర్ణయాలను తీసుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది.జగన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిగా అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కి వైఎస్ ప్రభుత్వం అరబిందో ఫార్మా, హెటిరో గ్రూప్ కంపెనీలకు అక్రమంగా లబ్ధి చేకూర్చిందని జగన్ అక్రమాస్తుల కేసులో తొలి జప్తుపై ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఆస్తుల స్వాధీనానికి అనుమతి కోరుతూ దాఖలైన కేసుల్లో న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థలో సుదీర్ఘ వాద ప్రతివాదాలు జరిగాయి. ఈ రెండు కేసుల్లో నల్ల ధనం చెలామణీ జరిగినట్లు నిర్థారించిన ధర్మాసనం.. ఈడీ విజ్ఞప్తి మేరకు అన్ని సంస్థల ఆస్తుల జప్తునకు ఆమోద ముద్ర వేస్తూ బుధవారం తీర్పు చెప్పింది. ఎమార్ ప్రాపర్టీస్‌కు చెందిన రూ.71 కోట్లు, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాకు చెందిన రూ.51 కోట్ల ఆస్తుల జప్తునకు ఉపక్రమించింది.అప్పటి సీఎం వైఎస్ ప్రోద్బలం వల్లనే అన్ని నిబంధనలను ఉల్లంఘించి భూ కేటాయింపులు చేశారని చెప్పారు. భారతీయ శిక్షా స్మృతి, అవినీతి నిరోధక చట్టం కింద నిర్థారించదగ్గ అనేక నేరాలకు అప్పటి ముఖ్యమంత్రి, అధికారులు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. ధరల నిర్ణాయక కమిటీ సవరించిన రేటు ఎకరానికి 23 లక్షలు అయితే ఏ ఆధారంపై ఎకరాన్ని 7 లక్షలుగా నిర్థారించారని ప్రశ్నించారు.రేపనేదే రానట్లుగా వారు ఆ భూముల స్వాధీనానికి ఎగబడ్డారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: