పాకిస్థాన్ భారత్‌కు తమ్ముడిలాంటిదని, రెండు దేశాల మధ్య సంబంధాలు గనుక మెరుగుపడితే అవి సూపర్ పవర్లుగా మారడం ఖాయం అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చడానికి కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. చైనా ప్రభుత్వం మనకు నష్టం కలిగించే కార్యక్రమాలు చేపడుతుంటే కళ్లు మూసుకున్న ప్రభుత్వం కేవలం పాకిస్థాన్ బలహీనతల మీదే ఎక్కువగా దృష్టి పెడుతోందని అన్నారు. ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన భారత, పాకిస్థాన్‌లు ఒకదానికొకటి తోడుగా నిలబడితే, మనల్ని సవాలు చేసే శక్తి ఏదీ ఉండదన్నారు.భారత్ కు పాకిస్తాన్ పక్కలో బల్లెంలా ఉన్న దేశం అని ములాయం మర్చిపోయారా లేక 2014 లో కొన్ని వర్గాల ఓట్ల కోసం వేట మొదలెట్టారా అని తేలాల్సి ఉంది. శాంతి కావాలన్న కోరిక భారతీయులలో ఉందన్నది నిస్సందేహం , కానీ గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ కు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లన్న కనీస పరిజ్ఞానంలేదని అనుకోవాలా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: