అది ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదానికి ప్రతీక. ప్రజలు తమ ప్రాణాలర్పించి సాధించుకున్న కర్మాగారం. యాభై ఏళ్లుగా అంచెలంచెలుగా అభివృద్ధి బాటలో నడిచిన ఫ్యాక్టరీ. అయినా పాలకుల ప్రోత్సాహానికి మాత్రం నోచుకోవట్లేదు విశాఖలో ఉక్కు కర్మాగారం.