జంట పేలుళ్ళ వల్ల సంభవించిన భారీ నష్టం నేపథ్యంలో మజ్లిస్‌ను మరోసారి లక్ష్యంగా చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. దాదాపు 15 సంవత్సరాలు అంటే 1998 తరువాత మళ్లీ భాజపా-మజ్లిస్‌ యుద్ధం తారాస్థాయిలో జరగనుంది. తెలంగాణా విషయంలో కూడా ఇది మరో మలుపని భావిస్తున్నారు.  హిందూమతాన్ని కించపరుస్తూ మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ కొద్ది రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, ఫలితంగా ప్రస్తుతం జైలులో ఉన్న సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మజ్లిస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పాతబస్తీలో మజ్లిస్‌పై పట్టు సాధించటం కోసం ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సుష్మా, వెంకయ్య వ్యాఖ్యలు ఊతమిస్తాయని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అసదుద్దీన్‌ కానీ, మజ్లిస్‌ ఎమ్మెల్యేలు కానీ ఘటన జరిగిన ప్రాంతం వైపు కన్నెత్తి చూడకపోవటం తమ ప్రచారానికి బాగా తోడ్పడుతుందని బీజేపీ నేతల ధీమా. అప్పట్లో ఈ పోరుకు తెదేపా జత కలిసి రాష్ట్రంలో భాజపా బలపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: