ప్రముఖ వ్యాపార దిగ్గజం, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కాసుల దానంలో కర్ణుడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన ధార్మిక సంస్థలకు భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు.  ఏకంగా 12, 300 కోట్ల విలువైన విప్రో షేర్లను ధార్మిక సంస్థకు ప్రేమ్ జీ దానంగా బదిలీ చేసి తనలోని విశాల హృదయాన్ని చాటుకున్నారు. దేశంలో అత్యధిక మొత్తాన్ని వితరణ చేసిన అపర దాన కర్ణుడిగా ఆయన నిలిచారు. తన ఫౌండేషన్ ద్వారా పేదల విద్య కోసం 9 వేల కోట్ల రూపాయలు వెచ్చించాలని ప్రేమ్ జీ ఇప్పటికే సంకల్పించారు. ప్రపంచ కుబేరులు బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లు ప్రతిపాదించిన ప్లెడ్జ్ టు గివ్ ఉద్యమం ద్వారా సామాజిక సేవ కోసం ముందుకొచ్చిన మొదటి భారతీయుడుగా ఆయనను చెప్పుకోవచ్చు. భారత దేశంలోని సంపన్నుల్లో అజీమ్ ప్రేమ్ జీ మూడో స్థానంలో ఉన్నారు, ఆయన సంపద విలువ 16 బిలియన్ డాలర్లు అంటే సుమారు 87 వేల కోట్ల రూపాయలు. ఇందులో అధిక భాగం సేవకే వినియోగిస్తానని ఆయన ఇప్పటికే చెప్పడంతో పాటు దాన్ని అమలు చేశారు కూడా. ఆ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: