మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1996లోనే పోఖ్రాన్‌లో అణు పరీక్షల నిర్వహణకు ప్రయత్నించారని , కాని ఆర్థిక ఆంక్షల భయంతోనే ఆగారని ఇప్పుడు అమెరికాకు చెందిన రహస్య కేబుల్స్ బయటపెట్టింది. అప్పట్లో పీవీ ప్రభుత్వం అణు పరీక్షలకు చేస్తున్న ప్రయత్నాలను ఉపగ్రహాలు చిత్రీకరించాయిని అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ (ఎన్ఎస్ఏ), న్యూక్లియర్ ప్రొలిఫిరేషన్ ఇంటర్నేషనల్ హిస్టరీ ప్రాజెక్టులు శుక్రవారం బయటపెట్టాయి. పోఖ్రాన్‌లో కదలికల ఆధారంగా అణు పరీక్షలకు పీవీ సర్కారు సన్నాహాలు చేస్తున్న విషయాన్ని క్లింటన్ ప్రభుత్వం1995 నవంబర్లోనే గుర్తించిందని , ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.. పరీక్షలు జరిపిన తర్వాత ఏర్పడే గుంతను పూడ్చేందుకు పెద్దఎత్తున మట్టిని తరలించడం తదితరాల కారణంగా అమెరికా ఈ నిర్ణయానికి వచ్చిందని , దీంతో 1995 డిసెంబర్లో, 1996 జనవరిలో పీవీ ప్రభుత్వంపై క్లింటన్ సర్కారు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి , పరీక్షలు జరిపితే ఆంక్షలు తప్పవని హెచ్చరించిందని కథనం. పీవీ ముఖ్య కార్యదర్శికి అమెరికా శాటిలైట్ చిత్రాలను చూపించిందని ఆ కేబుల్స్‌లో పేర్కొన్నారు. అణు పరీక్షలు జరిపితే అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షలూ తప్పవు, దీంతో ఆర్థిక సరళీకరణ కార్యక్రమానికి ఎదురు దెబ్బ తగులుతుందని భావించి ఆఖరకు పీవీ వెనక్కుతగ్గారని బయటపెట్టాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: