రైతులు కత్తులు, కొడవళ్లతో మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను చంపాలి, రోడ్డెక్కి తిరగబడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చా రు. అప్పుడే కాంగ్రెస్ కు బుద్ధివస్తుందని అన్నారు . పేదవాళ్లు తెల్లచొక్కా వేసుకొంటే వైఎస్ రాజశేఖరరెడ్డి సహించేవారు కాదు. పెత్తందారీ, భూస్వామ్య పోకడలతో వ్యవహరించేవారని గుర్తుచేశారు.  గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం పేటేరు నుంచి ఆదివారం ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పలుచోట్ల పార్టీ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ప్రజలను నరకయాతన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదని, దాన్ని ఎవరూ కాపాడలేరని జోస్యం పలికారు. అధికారంలోకి వస్తే గీత కార్మికులను ఎక్సైజ్ శాఖ నుంచి తొలగిం చి పౌరసరఫరాల పరిధిలోకి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భూములు కొనుగోలు చేసి తాటి చెట్ల పెంపకానికి, గొర్రెలను మేపుకోడానికి కేటాయిస్తామని గీత కార్మికులుభరోసా ఇచ్చారు. వ్యవసాయం కోసం చాలామంది రైతులు ఇంట్లో ఆడవారి బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసారని ఆ రుణాలన్నింటినీ మాఫీ చేసి ఆ బంగారమంతా విడిపిస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: