వీలైనంతలో రాష్ట్రానికి కేటాయింపులు బాగానే చేశానని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన న్యాయం జరిగిందని, తనకు చాలా తృప్తిగా ఉందని చెప్పారు. విలేకరుల సమావేశంలో కోట్ల మాట్లాడాతూ ఇది ఎన్నికల బడ్జెట్ కాదని, రాష్ట్రానికి సంబంధించి మొత్తం 50 మేజర్ ప్రాజెక్టులుండగా, వాటిలో 20 ఇప్పటికే పూర్తయ్యాయని, మరో 30 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిని పూర్తి చేయాలంటే రూ.40-50 వేల కోట్లు అవసరమవుతాయని, కాకపోతే రైల్వే శాఖ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. కర్నూలుపై ఎక్కువ శ్రద్ధ పెట్టారని ప్రస్తావించగా, గతంలో రైల్వే మంత్రులుగా ఉన్న నితీశ్ కుమార్, మమతా బెనర్జీలు తమ తమ ప్రాంతాలకు చాలా చేసుకున్నారని, అప్పుడు వారిని ఎవరూ ప్రశ్నించలేదని చెప్పారు. కర్నూలులో ఏర్పాటు చేయతలపెట్టిన వర్క్‌షాపునకు రైల్వే శాఖ రూ.110 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం 125 ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తోందని కాలం తీరిన బోగీలను ఇక్కడ మరమ్మతు చేస్తామని చెప్పారు. దక్షిణ భారతంలో ఇదే మొట్టమొదటి వర్క్‌షాపు అని చెప్పారు.మొత్తానికి చూస్తే మంత్రి వర్యులకు మాత్రం ఈ బడ్జెట్ త్రుప్తినిస్తోంది, కాని ప్రజలకు , అందునా 9 ఏళ్ల యుపీఏ ప్రభుత్వం హాయంలో అస్సలు లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: