అసలు తాము ఎందుకు సంపాదిస్తున్నామో మధ్య , దిగువ తరగతి ప్రజలకు అర్థం కావట్లేదు. రైల్వే సరుకు రవాణా రేట్లు సుమారు 7% పెరగడంతో ఆ మేరకు ఆహారధాన్యాలు, ఎల్పీజీ, డీజిల్ ధరలపై పభావం చూపించనుంది. అభివృద్ధి చార్జీలు, రద్దీ సీజన్ చార్జీలు వీటికి అదనం కావడంతో రిటైల్ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు, ఎల్పీజీ, డీజిల్ వంటి వాటి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. బొగ్గుపై కూడా రవాణా చార్జీలను పెంచడం వల్ల విద్యుత్తు చార్జీలు వినియోగదారులకు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమురు సంస్థలు డీజిల్, ఎల్పీజీ, కిరోసిన్‌లను 32-33 శాతం మేరకు రైల్వేల ద్వారానే రవాణా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో రవాణా చార్జీల పెంపు భారాన్ని చమురు సంస్థలు నేరుగా వినియోగదారులపై మోపే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే, సాధారణ బడ్జెట్‌లో ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ భారాన్ని భరించే పరిస్థితి లేదని, అందువల్ల వినియోగదారులపైనే భారం పడే అవకాశాలు ఉన్నాయని వేరే చెప్పకర్లేదు. ఇక బొగ్గు రవాణా చార్జీలు ప్రస్తుతం టన్నుకు రూ.685.10 నుండి రూ.724.80కి పెంచారు. అయితే, పెరిగిన బొగ్గు రవాణా చార్జీలను విద్యుదుత్పాదక సంస్థలే భరించాల్సి ఉంటుంది. ఫలితంగా అవి విద్యుత్ చార్జీలను పెంచే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మరోవైపు ధాన్యం, యూరియా, తదితరాల రవాణా చార్జీలు కూడా పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: