స్టేజ్ పై డ్యాన్స్ చేస్తున్న డ్యాన్సర్ ను ఒక వ్యక్తి కాల్చేసిన దారుణ సంఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది. స్టేజ్ పై డ్యాన్స్ చేస్తున్న 22 సంవత్సరాల యువతి తనతో కలిసి డ్యాన్స్ చేయలేదని ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆమెను తుపాకీతో కాల్చేశాడు. నిందితుడు డాన్సర్‌ను కాల్చిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడితో పాటు అతని స్నేహితులు ఇద్దరు, ఫంక్షన్ హాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.