తమిళనాడు రాజకీయాల్లో సంచలన రాజకీయాలకు మారు పేరు, ఆమె ప్రకటన చేసిందంటే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరుగెడతాయి. పథకాలు ప్రకటిస్తే... అమలు కావాల్సిందే. ఎదురు తిరిగితే అంతే సొంత పార్టీ నాయకుడికైనా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. అదే స్టైల్ తో తనదైన మార్క్ పాలనతో ముందుకు పోయిన మహిళ నేత ఎవరంటే ముమ్మాటికి జయలలితే నని చెప్పక తప్పదు.