ఆర్థిక మంత్రి చిదంబరం మహిళల భద్రతకు పెట్టపీట వేస్తున్నట్టు ప్రకటించారు. సమాజంలో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చిదంబరం చెప్పారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ అత్యాచార ఘటనలో మృతి చెందిన నిర్భయ పేరుతో ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఫండ్ కు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు చిదంబరం లోక్ సభలో ప్రకటించారు. చిదంబరం ఈ నిర్ణయం ప్రకటిస్తున్నపుడు లోక్ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రతిపక్ష బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కళ్లలో ఆనందం కనిపించింది. మొత్తానికి ఇటీవల వరుసగా మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలపై చిదంబరం ఆవేదన చెందినట్టు కనిపించారు. మహిళా సంఘాల అభ్యర్థనలు మన్నించిన చిదంబరం వెయ్యికోట్ల రూపాయాల నిధులు కేటాయించడం శుభ పరిణామమే. అయితే ఆ నిధులు నిజంగా మహిళల భద్రతకు, ఇబ్బందులుపడుతున్న వారికి అందేలా చూడాల్సిన బాధ్యత మాత్రం చాలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: