సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షా విధానంలో భారీ మార్పులు రానున్నాయి. ఈ మేరకు యూజీసీ మాజీ చైర్మన్ అరుణ్ నిగవేకర్ కమిటీ చేసిన సిఫార్సులను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించారు.  2013లో సివిల్స్ మెయిన్స్ కొత్త విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం కీలకంగా కొనసాగిన ఆప్షనల్స్ వెయిటేజీని 1,200 నుంచి కేవలం 500 మార్కులకు పరిమితం చేసి, జనరల్ స్టడీస్‌కు వెయిటేజీని రెట్టింపు చేయడం ప్రధాన మార్పు. అంతేకాక 200 మార్కుల ఎస్సే పేపర్‌ను పూర్తిగా తొలగించి జనరల్ స్టడీస్‌లో భాగం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ అర్హత పరీక్షలుగామాత్రమే ఉన్న ఇంగ్లిష్, ప్రాంతీయ భాషా పరీక్షలను కలిపి ఒకే పేపర్‌గా రూపొందించడం, దీన్ని ఫైనల్ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోనుండటం మరో కీలక మార్పు. గతంలో పది పేపర్లకు కలిపి 2000 మార్కులుండగా, మారిన విధానం ప్రకారం ఏడు పేపర్లకు ఒక్కోదానికి 250 చొప్పున 1750 మార్కులు కేటాయించనున్నారు. గతంలో 300 మార్కుల ఇంగ్లిష్ పరీక్ష, 300 మార్కుల ప్రాంతీయ భాషా పరీక్ష కేవలం అర్హత పరీక్షలుగా ఉండేవి.ప్రస్తుతం ఈ రెండింటిని కలిపి ఒకే పేపర్ చేయనున్నారు. పేపర్-1గా పేర్కొనే ఈ పేపర్‌కు 250 మార్కులు కేటాయించనున్నారు. ఇందులో ఇంగ్లిష్‌కు 30 మార్కులు కేటాయించనున్నట్లు వెల్లడయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: