రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఒడిశా నుండి దక్షిణ తమిళానాడు వరకు కోస్తాంధ్ర మీదుగా వస్తరించిన అల్పపీడన ధ్రోణి కారణంగా వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.  25న వాయువ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 223 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో సగటుకంటే 12 శాతం, తెలంగాణలో ఒక శాతం అధికంగా వర్షపాతం నమోదుకాగా,  రాయలసీమలో మాత్రం 6 శాతం తక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గత రాత్రి 8.30 గంటలకు 15.2 సెం.మీ వర్షం కురిసినట్లు విపత్తు నిర్వాహణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నకుమార్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: