రాష్ట్రంలోని రక్షణ శాఖ కార్యకలాపాలకు మరో వేదిక సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో క్షిపణి పరీక్ష వేదికల ఏర్పాటుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ప్రతిపాదించింది.  మన రాష్ట్రంలో కృష్ణాజిల్లా నాగాయలంకతో పాటు రుట్‌లాండ్ దీవుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదిత వేదికల కోసం అటవీభూములను బదలాయించాల్సిందిగా డీఆర్‌డీవో అధికారులు కోరారని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో తెలిపారు. క్షిపణి పరీక్ష వేదికల ఏర్పాటు ప్రణాళిక ఇంకా తొలిదశలోనే ఉందని, భూసేకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు ఆంటోనీ. డీఆర్‌డీవో ప్రతిపాదనలకు పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖలు, రెవెన్యూ వర్గాల ఆమోదం లభించిన తరువాతే అనుమతి ఇస్తామని చెప్పారు. ఇప్పటికే గుంటూరు జిల్లా సూర్యలంక లో విమాన విధ్వంశక క్షిపణి పరీక్ష కేంద్రం ఉండడంతో ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: