త్రిపురలో ఐదోసారి వామపక్ష కూటమి విజయఢంకా మోగించబోతోంది. 1998 నుంచి ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న 64 ఏళ్ల మానిక్‌ సర్కరు ముద్ర ఈసారి ఫలితాలపై కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం వామపక్ష కూటమి 35 స్థానాల్లో విజయం సాధించి, 13 స్థానాల్లో ఆధ్యిక్యంలో ఉంది. త్రిపురలో మొత్తం 60 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  త్రిపుర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. ఐదు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ మరో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 44 స్థానాల్లో లెఫ్ట్ కూటమి ముందంజలో ఉంది. మాణిక్ సర్కార్ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: