దేశ ప్రజల నెత్తిన పెట్రో బాంబ్‌ మరోసారి పడింది. ప్రభుత్వం మరోమారు సామాన్యుడి నడ్డి విరిచింది. వ్యాట్‌ భారాన్ని మోసేందుకు సిద్ధమవుతున్న ప్రజల నెత్తిన పెట్రో పిడుగు పడింది. కేంద్రం పెట్రోల్‌ ధరను లీటర్‌కు రూ.1:40 పైసలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రజలకు విస్మయం కల్గిస్తోంది. ఈ పెరిగిన ధరలు శుక్రవారం  అర్ధరాత్రి నుంచే అమలులోకి  రానున్నాయి.   2012-13  పార్లమెంట్ లో సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే పెట్రోల్ ధరలను  పెంచుతూ నిర్ణయం తీసుకుంది ధరలను పెంచడం వెనుక రాజకీయ మర్మం ఏదైనాఉందా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది.... పెంచిన ధరలను మళ్లి తగ్గించి ప్రజల మెప్పుపొందేందుకు కేంద్రప్రభుత్వం ఇలా చేస్తుందా.. ఏదేమైనా ఈ నిర్ణయాన్ని విపక్షాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.  ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వేసవి తాపానికి తోడు పెట్రో మంట ప్రజలకు మరింత చిరెత్తేలా చేస్తోంది.. గత నెలలోనే ధరలను పెంచిన ప్రభుత్వం ప్రజలకు కన్నీళ్ళు మిగులుస్తోంది. పెట్రో ధరలు పెంచిన ప్రతిసారీ దేశంలో అనుభందంగా ఉన్న అన్ని నిత్యావసరాల ధరలు పెరగటం పరిపాటే.  

మరింత సమాచారం తెలుసుకోండి: