అందంతో వలేస్తుంది. మాటలతో మత్తెకిస్తుంది. ముగ్గులోకి దింపుతుంది. ప్రేమించుకుందాం... ప్రేమంటే ఇదేరా అనే రేంజ్లో బిల్డప్ ఇచ్చి పెళ్లి చేసుందాం రా అని పిలుస్తుంది. ఆ మాటలను నమ్మి పెళ్లి పీటలెక్కి తాళి కడితే చాలు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగిన అరుదైన మోసమిది. ‘పెళ్లి చేసుకుని, ఇల్లు దోచుకుని’ అన్నట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 28 ఏళ్ల ఓ మహిళ ధనార్జనకు వివాహాన్ని వృత్తిగా ఎంచుకుంది. వరుసబెట్టి 11 మంది జీవితాల్లోకి అర్ధాంగిగా ప్రవేశించింది. ఒకరి తర్వాత ఒకరిని లూటీ