మన రాహుల్ చాలా మంచి బాలుడు. అందరూ కలిసి ఆయనకు నడక, నడత, మాటలు నేర్పారు. అలాంటి బాలుడు గత కొన్ని సంవత్సరాల పాత వార్తా పత్రికలు జ్ఞాన సమూపార్జన కోసం చదవటం ఇప్పుడిప్పుడే ప్రారంభించాడు. ఆ క్రమంలో 2013 అక్టొబర్ నెలలో కనిపించిన ఒక రోజు పేపర్ చూసాడు. షాక్ అయ్యాడు అందులో నరెంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లంచం తీసుకుంటుండగా చూసి తాను చదివే పత్రిక ఈ రోజుదేనని భావించి, స్టన్నై తాను పార్లమెంటులో మాట్లాడి భూకంపం సృష్టిస్తానని తన వందిమాగదులకు చెప్పాడు.