చిన్నప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమని చికాగో ఎడ్యుకేషన్ అకాడమీ భావిస్తోంది. నేషనల్ సెక్స్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ సూచించిన విధంగా.. ఆరేళ్లలోపు చిన్నారులకు.. ఆ విజ్ఞానం అందించాలని భావిస్తోంది. 2016 లోగా కొత్త కరికులమ్‌ అమలుచేస్తామని.. చికాగో పబ్లిక్ స్కూల్ ప్రకటించింది.చికాగో ఎడ్యుకేషన్ అకాడమీ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కిండర్ గార్టెన్ చిన్నారులకు సెక్స్ ఎడ్యుకేషన్ అందించాలని ప్రపోజల్ చేసింది.  ఆరేళ్ల లోపు చదువుకునే పిల్లలకు ఈ రకమైన నాలేడ్జ్ అవసరమని... నేషనల్ సెక్సువల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ సూచించిన ప్రకారంగానే అకాడమీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిండించింది. దీని ప్రకారం నాలుగో గ్రేడ్ పిల్లలకు యుక్తవయస్సు, హెచ్ఐవీ వైరస్ ల గురించి నేర్పుతారు. ఇక ఐదో గ్రేడ్ పిల్లలకు ప్రత్యుత్పత్తి, గర్భము, హెచ్ఐవీ ఎలా వ్యాపిస్తుంది, నివారణ, లైంగిక ధోరిణి, లైంగిక దాడులపై అవగాహన కల్పిస్తారు.  మరోవైపు ఈ ప్రపోజల్ పై పేరెంట్స్ రియాక్షన్ భిన్నంగా ఉంది. కొందరేమో చిన్నప్పుడే సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఇంటి నుంచే ప్రారంభంకావాలని... చికాగో పబ్లిక్ స్కూల్ తీసుకున్న నిర్ణయం మంచిదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: