విశాఖలో జిల్లా డీఆర్సీ సమీక్షా సమావేశం ప్రాంగణం రసాభాసగా మారింది. లోపల సమావేశం జరుగుతూ ఉంటే... బయట మంత్రి బాలరాజు మద్దతు దారులు ఎమ్మెల్యే కన్నబాబు కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కులం పేరుతో మంత్రి బాలరాజును అనుచిత వ్యాఖ్యలు చేసిన కన్నబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వభూమిని కబ్జా చేసిన కన్నబాబు వ్యవహారంపై విచారణ జరిపించాలని నినాదాలు చేసారు. సమావేశంలో జరిగే చోటుకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో... పోలీసులు అడ్డుకున్నారు. చివరకు జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన బయటకు వచ్చి ఆందోళకారులకు నచ్చజెప్పారు. మంత్రి బాలరాజు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో... గిరిజన సంఘాల నేతలు ఆందోళన విరమించారు.  మరోవైపు ఆందోళనపై యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు స్పందించారు. సీఎం కిరణ్ సూచనల మేరకే తాను వ్యవహరిస్తున్నానని... సహకార ఎన్నికల్లో మంత్రి బాలరాజు కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిని కోరుకున్నారన్నారు. మంత్రి గంటా మీకు అండగా ఉన్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తాను స్వతంత్రుడనని ఎవరి సహాయ సహకారం అవసరం లేదని కన్నబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: