ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు ఉంది రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ నేతల పరిస్థితి. 2014 ఎన్నికలే లక్ష్యంగా ఎంఐఎంను బలేపేతం. చేసే ఉద్దేశ్యంతో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో నిర్వహించిన బహిరంగ సభ ఎంఐఎం పార్టీతోపాటు.. ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ జీవితాన్నే మార్చేసింది. వారి రాజకీయ లక్ష్యం ఎలా ఉన్నా వ్యక్తిగతంతా తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. లోపలికి దిగితే గాని బావి లోతు తెలియదన్నట్టు... సమస్యల్లో చిక్కుంటేగాని వాటి పర్యవసానం అర్థంకాదన్నది ఎంఐఎం నేతలు గ్రహించారు. దీంతో ఇప్పుడు ఎంఐఎం నేతలు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటే ఎఐఎం ఎంపీ అసదుద్దీన్ .. హిందువులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చానళ్ల చుట్టూ తిరిగి మరీ వివరణ ఇచ్చుకున్నారు. హిందువులంటే తమకు వ్యతిరేకంగా కాదని, కేవలం బిజెపీని, సంఘ్ పరివార్ లను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనపైనా అసదుద్దీన్ స్పందించారు. అయితే జరిగిన సంఘటనను ఓ మతానికి ఆపాదించవద్దని...  చనిపోయిన వారితోపాటు, బాధితుల్లో ముస్లింలు కూడా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. అంటే విచారణ పేరుతో మూలాల్లోకి వెల్లి చిరవకు ఇది ఓ మతం వారిపనే అన్న భయాన్ని సృష్టిస్తారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలో భయం స్పష్టంగా కనిపించింది. వైఎస్ సీఎంగా ఉన్నపుడు ఆడింది ఆట, పాడింది పాటగా సాగినా... కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంఐఎం పప్పులు ఉడకకపోవడంతో... ఏదో చేయాలనుకుని ఇలా కేసుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.  ఇప్పటికైనా మజ్లిస్ పార్టీ ఒక్కటే కాదు ఏ రాజకీయపార్టీ అయినా ప్రజా సమస్యలపై పోరాడి.. ప్రజల నుంచి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా కుల, మత ప్రాతిపదికన ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటే మొదటికే మోసం రావచ్చన్నది గ్రహించాల్సి అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: