భారతీయ సంతతి బాలిక నేహారాము(12) ప్రజ్ఞ మేధో ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. అమెకున్న మేధస్సుస్ఠాయి (ఐక్యూ) ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్ లాంటి మహామహులకంటే ఎక్కువ. వీరి మేదస్సు స్థాయి 160. నేహారాము వీరికంటే మరో రెండు పాయింట్లు ఎక్కువగా 162 సాధించి రికార్డు సృష్టించింది. ప్రజల్లో మేధస్సు స్థాయి సూచీలు కొలవడానికి యు.కె.లోని మెన్స నిర్వహించే ఐఐఐబీ పరీక్షలో ఆమె ఈస్కోరు సాధించింది. నేహ ఏడేళ్ళ వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు మునిరాజు, జయశ్రీలు భారత్ నుంచి కింగ్ స్టన్ కు వలస వెళ్లి స్థిరపడ్డారు. ఇద్దరూ వైద్యులే, నేహా సాధించిన విజయంతో ఆమె తల్లి జయశ్రీ ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. నేహాను చూసి గర్వపడుతున్నాం, ఈ సంతోషం మాటల్లో చెప్పలేము అన్నారామే. ఆమె మేధస్సును మొదట్లో ఆమె తల్లిదండ్రులు పెద్దగా గుర్తించలేదు. అయితే ఒకసారి అక్కడ స్థానికంగా ఒక ఆంగ్ల వ్యాకరణ పాఠశాల ‘టిఫిన్ గాళ్స్’ నిర్వహించిన పరీక్షల్లో ఆహె 280కి 280 మార్కులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పటినుంచి ఆమె తల్లిదండ్రులు ఆమె మేధస్సుపై దృష్టిసారించారు. హారీపోటర్ కు వీరాభిమాని అయిన నేహాకు ఈత కొట్టడం మహా సరధా తన తల్లిదండ్రులు లాగానే తాను కూడా వైద్య వృత్తి చేపట్టాలని భావిస్తోంది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డు విశ్వ విద్యాలయంలో సీటు కోసం ఆమె అప్పుడే దృష్టి సారించిరు. మెన్స పరీక్ష చాలా కష్టం, నిజంగా నేను ఇందులో ఇంతస్కోరు సాధిస్తానని అనుకోలేదు. నిన్న (సోమవారం) ఫలితాలు చూసి ఆశ్చర్యనొయా నిజంగా చాలా సంతోషంగా ఉంది. అని నేహారాము అన్నారు. ఐన్ స్టీన్ తన జీవిత కాలంలో ఇప్పుడూ ఇలాంటి మేధో స్థాయి పరీక్షలు ఎదుర్కోకున్న ఆయన మేధో స్థాయి 160 వరకు ఉంటుందని నిపుణులు లెక్కగట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: