తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. కార్పొరేట్ నేతలకు అండగా ఉంటారన్న అపవాదు ఎదుర్కొంటున్న చంద్రబాబు... పేదల బాబుగా ఇప్పుడు పార్టీ కోసం కార్యకర్తల నుంచి చందాలు సేకరించే పనిలోపడ్డారు. వస్తున్నా మీకోసం అంటూ చేస్తున్న పాదయాత్రలో కార్యకర్తలు ఇచ్చే పది, ఇరవై రూపాయలు కూడా చందాల రూపంలో స్వీకరిస్తున్నారు. అలా ఇచ్చిన వారి పేర్లను తన ప్రసంగం సందర్భంగా మైక్ లో ప్రకటిస్తున్నారు. ఓ తమ్ముడు 20 రూపాయలు..ఓ ఆడపడుచు 50 రూపాయలు.. ఓ తల్లి 100 రూపాయలు. ఇదీ చంద్రబాబు నాయుడు వసులు చేస్తోన్న చందాల లెక్కలు.. ఏ రాజకీయపార్టీ కైనా అభిమానులు చందాలు ఇవ్వటం సర్వ సాధారణం. ఐతే ప్రజల మధ్య పార్టీ ఫండ్స్ ఇచ్చిపుచ్చుకోవడం జరగదు. అందులోను పార్టీ అధినేతలు చందాలు తీసుకుంటున్నట్లు ఎక్కడా కనిపించరు. కాని వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు మాత్రం తన దైన శైలిలో ఈ చందాలు తీసుకుంటున్నారు. అధినేతే స్వయంగా చందాలు వసులు సేకరిస్తుండటంతో పేరు కోసం కాకపోయినా చంద్రబాబు చేతికి డబ్బులు ఇచ్చేందుకు అయినా జేబులో డబ్బున్న ప్రతి తమ్ముడు ఆయన దగ్గరకు వెళ్తున్నారు.  బాబు ఈ విధంగా వసూళ్లు చేయడానికి వెనుక కారణాలు అన్వేషిస్తే తొమ్మిది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయ్యింది. అధికారం లేకపోవడంతో చందాలు కూడా తగ్గాయి. మరో ఏడాది లో ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన పార్టీ ఆర్దిక సంక్షోభాన్ని అదిగమించేందుకే కార్యకర్తలు, పార్టీ అభిమానుల నుంచి చందాలు వసూలు తీసుకుంటున్నారని పలువురు నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: