పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తున్నానంటూ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర తర్వాత కూడా తన తీరు మాత్రం మార్చుకున్నట్లు కనిపించడం లేదని ఆపార్టీ నేతలే గుసగులాడుతున్నారు. ఎన్నికల ఏవైనా అదే సాగతీత. టిక్కెట్ ఎవరికిస్తారో చెప్పరు. కొందరికి హమీ ఇస్తారు. మరెవరికో టిక్కెట్ ఖరారు చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు స్టైల్ అని నేతలంతా లోలోన ఆగ్రహంగా ఉన్నారు. టిక్కెట్ వద్దన్న వారిని మండలికి పంపించి మండలిలో పార్టీ వాయిస్ ని బలంగా వినిపించిన వారిని బయటకి పంపడాన్ని కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ఒకప్పుడు పేదల పార్టీగా ఉన్న టిడిపి ఇప్పుడు కార్పోరేట్ల పార్టీగా అవతారం ఎత్తిందంటూ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రతో పార్టీని పటిష్టం చేస్తారనుకుంటే మరో పంక్చర్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని నేతలు మధనపడుతున్నారు. అందరు వూహించిన వారిని కాదని తాను అనుకున్న వారికి టిక్కెట్ ఇచ్చి చిక్కులు తెచ్చుకోవటం బాబుకి అలవాటుగా మారిందంటున్నారు. సామాజిక కోణాలు, వర్గాల పేరుతో లెక్కలు వేసి పార్టీని మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి నడిచేలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఒక పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న దాడి వీరభద్రరావులాంటి వారే చంద్రబాబుపై ఎదురుదాడి చేశారంటే అసంతృప్తి ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే రాజకీయ చాణుక్యుడు గా పేరుగాంచిన బాబు వ్యూహ్యాలు ఇప్పుడు తేలిపోతున్నాయి. ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చిన వారివల్ల పార్టీకి వచ్చే లాభమేదీ లేదని సీనియర్లు అంటున్నారు. చంద్రబాబు తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని సీనియర్ల నుంచే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: