విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభం సమసిపోవాలంటే అందుకుతగ్గ పరిష్కారాలు అన్వేషించాలన్నారు. విద్యుత్ సమస్యలపై మూడేళ్ల క్రితమే దివంగత వైఎస్ కు సలహాలు, సూచనలు చేశానని చెప్పారు. శాసనసభలో అధికార, విపక్షాలు ఒకరిని ఒకరు తిట్టుకోవడం వల్ల సభా సమయం వృధా అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జేపీ, ప్రభుత్వానికి రైతుల సంక్షేమం గురించి మాట్లాడే హక్కులేదన్నారు. విద్యుత్ సమస్యలపై వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సలహాలు, సూచనలు చేశానని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ కాగితాలకే పరిమితమయింది తప్ప అందువల్ల ఒరిగిందేమీ లేదన్నారు. ఉపాధి హామీ కోసం వెచ్చించే డబ్బును వ్యవసాయానికి ఉపయోగిస్తే బంగారం పండుతుందన్నారు. చట్టసభలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. కుల వ్యవస్థ పోవాలంటే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. సీబీఐ, లోకాయుక్తలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: